విద్యార్థినుల ప్రయాణ సౌకర్యంపై పోచారం శ్రీనివాసరెడ్డి శ్రద్ధ

బాన్సువాడ,డైనమిక్, అక్టోబర్ 23 నసురుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని ఎస్‌.ఆర్‌.ఎన్‌.కె కళాశాల నుండి గురుకుల వసతి గృహ విద్యార్థినుల విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులో విద్యార్థినులతో కలిసి గురువారం ప్రయాణం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ ఛైర్మన్ కాసుల బాలరాజు. విద్యార్థినుల సమస్యపై వెంటనే చర్య ఈ నెల 14వ తేదీన బాన్సువాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్తూ దుర్కి శివారులో రహదారిపై బాన్సువాడ వైపు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థినులను గమనించిన పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే...