కాంగ్రెస్ పాలన అవినీతి కంపుతోఊపిరాడనివ్వట్లేదు: కేటీఆర్ తెలంగాణ భవన్‌లో బీజేపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు – గన్ కల్చర్, మాఫియా రాజ్యంగా మారిన రాష్ట్రం – బలహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలం
డైనమిక్ డెస్క్,హైదరాబాద్, అక్టోబర్ 23 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన అవినీతి, అరాచకాలు, గన్ కల్చర్‌తో ప్రజలకు ఊపిరాడనివ్వడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రం మొత్తం అవినీతి దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజల భద్రత, పరిపాలన అన్నీ కాంగ్రెస్ నేతల వాటాల పంచాయతీగా మారిపోయాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్ రెడ్డి – బలహీన ముఖ్యమంత్రి’ రాజకీయ జీవితంలో ఇంత బలహీన ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించేంత స్థాయిలో ముఖ్యమంత్రి దిగజారాడు. నిందితులను మంత్రులు...