యుద్ధ ప్రాతిపదికన హుజూర్నగర్ జాబ్ మేళా ఏర్పాట్లు యువత భారీగా పాల్గొని ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

డైనమిక్,సూర్యాపేట బ్యూరో , అక్టోబర్ 23 జిల్లాలో జరుగనున్న హుజూర్నగర్ మెగా జాబ్ మేళా ఏర్పాట్లు శర వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ (శనివారం) హుజూర్నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ మేళా జరగనుంది.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. యువత భారీ సంఖ్యలో హాజరై ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. స్టాల్స్ కేటాయింపులపై సూచనలు కంపెనీల వారీగా స్టాల్స్ కేటాయింపుల వివరాలను వెంటనే సమర్పించాలంటూ సింగరేణి ప్రతినిధి చందర్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద రద్దీని నివారించేందుకు రంగాల...