గులాబీ బాస్ వద్ద బీఆర్ఎస్ నేతల హడావిడి సమావేశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కీలక వ్యూహాలు – కేసీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్,డైనమిక్ అక్టోబర్ 23 మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)తో బీఆర్ఎస్ కీలక నేతలు గురువారం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో భేటీ అయ్యారు. పలు రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసీఆర్ సమక్షంలో కీలక చర్చలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్వర్‌రెడ్డి లతో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ వ్యూహం, ప్రచార తీరుతెన్నులు, స్థానిక శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఉప ఎన్నికపై కేసీఆర్ స్పష్టమైన మార్గనిర్దేశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్, పార్టీ శ్రేణులకు...