దయనీయ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రులు – ఎంజీఎంలో నిర్లక్ష్యం బహిర్గతం
డైనమిక్,వరంగల్, అక్టోబర్ 25 వరంగల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్య సేవల దయనీయ పరిస్థితులు మరోసారి బయటపడ్డాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి రెండు పసిపిల్లలు బలైపోయే పరిస్థితి ఏర్పడింది. ఒకే సిలిండర్‌పై ఇద్దరు చిన్నారులు శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో ఇద్దరు పసిపిల్లలకు శ్వాసలో ఇబ్బందులు తలెత్తడంతో వైద్యులు ఆక్సిజన్ అవసరం ఉందని సూచించారు. కానీ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు సరిపోకపోవడంతో, సిబ్బంది ఒకే సిలిండర్‌ను ఇద్దరికీ కలిపి అమర్చారు. ఈ ఘటనను చూసిన ఇతర రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులే తరలించిన పిల్లలు పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని పరీక్షలకు తరలించాల్సి...