ఒంటరి మహిళలను టార్గెట్ చేసిన చైన్ స్నాచర్ అరెస్ట్నిందితుడి వద్ద నుండి 15 లక్షల విలువైన బంగారం, రెండు బైకులు స్వాధీనంనార్కెట్‌పల్లి పోలీసులు ఘనవిజయం
డైనమిక్ ,నల్లగొండ బ్యూరో , అక్టోబర్ 25 ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడల్లో ఉన్న బంగారు పుస్తెల తాళ్లు లాక్కొని పారిపోయే చైన్ స్నాచర్‌ను నార్కెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 9.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ సుమారు 15 లక్షలు. నిందితుడి వివరాలు పోలీసుల ప్రకారం, నిందితుడు బొలుగూరి శివ (వయసు 24 సంవత్సరాలు), ఆటో డ్రైవర్, పులిపలుపుల గ్రామం, మునుగోడు మండలం, నల్లగొండ జిల్లా వాసి. చెడు వ్యసనాలకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. సంఘటన ఎలా...