బాపట్ల జిల్లా లో తాత్కాలికంగా బీచ్ ల మూసివేత– జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలియాత్రికులు సముద్ర తీరాలకు రావద్దు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దువేటకు వెళ్లి ఉంటే తిరిగి వచ్చేయాలి

డైనమిక్,బాపట్ల జిల్లా, అక్టోబర్ 25 జిల్లా పరిధిలోని బీచ్ లను తాత్కాలికంగా మూసివేస్తున్నామని, యాత్రికులకు/భక్తులకు ప్రవేశం లేదని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మోంతా తుఫానుగా మార్పు చెందే అవకాశం ఉందని, వాతావరణ శాఖ నుండి అందిన సమాచారం మేరకు ఈనెల 27, 28, 29 తేదీలలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వుల మేరకు...