రేపు  ఎస్ఆర్ఎం వర్సిటీ5వ స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్

మంగళగిరి,డైనమిక్,అక్టోబర్27 ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. మంగళవారం ఉదయ 11 గంటలకు యూనివర్శిటీ ఆడిటోరియంలో విద్యార్థులకు డిగ్రీల ప్రదానం జరుగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ మేరకు యూనివర్సిటీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. యూనివర్సిటీలో 2020-25 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ చదివిన 1877 మంది విద్యార్థులకు, మరో 39 మంది పరిశోధనా విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. ఇందులో 45 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు, 7 నుంది స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులకు, నలుగురు లిబరల్ ఆర్ట్స్ విద్యార్థులకు ఈ సందర్భంగా బంగారు, వెండి పతకాలను ప్రదానం చేయనున్నారు.స్నాతకోత్సవం ఉదయం 11...