బ్రాండిక్స్ సంస్థకు రక్షణ చర్యలు – మంత్రి నారా లోకేష్ హామీ

అమరావతి, ఏపి డైనమిక్ డెస్క్, అక్టోబర్ 27 ట్రంప్ ప్రభుత్వం విధించిన అదనపు టారిఫ్‌ల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న బ్రాండిక్స్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పరిస్థితిని త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లి ఉపశమన చర్యలు తీసుకుంటామని తెలిపారు.బ్రాండిక్స్ ఇండియా డైరెక్టర్ మరియు భారతీయ భాగస్వామి పి.సి. దొరస్వామి సోమవారం మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా సంస్థ మనుగడకు ముప్పు వాటిల్లుతోందని, ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.దొరస్వామి వివరించిన ప్రకారం,...