విడుదలైన ఖైదీలకు స్వయం ఉపాధి అవకాశాలు : జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా
నిజామాబాద్ ,డైనమిక్ , అక్టోబర్ 27 శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీల జీవితాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ కొత్త అడుగులు వేస్తోంది. మాజీ ఖైదీలకు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసింది. నిజామాబాద్ మల్లారంలో కొత్త పెట్రోల్ బంక్ ప్రారంభం సోమవారం నిజామాబాద్ జిల్లా మల్లారం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. “అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి” – డీజీ సౌమ్య మిశ్రా ఈ సందర్భంగా డాక్టర్...