నిజాయతీగా ఉండటమే కాదు… అవినీతిని అడ్డుకోవాలి..! బి. వెంకన్న, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్
సింగరేణి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ప్రారంభం హైదరాబాద్, డైనమిక్ డెస్క్, అక్టోబర్ 27 సింగరేణి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్), చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి. వెంకన్న మాట్లాడుతూ “నిజాయతీగా ఉండటమే కాదు, అవినీతిని అడ్డుకోవాలి” అని పిలుపునిచ్చారు. అవినీతి ఎదుర్కోవటం ప్రతీ పౌరుడి బాధ్యత సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి అవినీతి ఒక పెద్ద అవరోధమని తెలిపారు. దీనిని ఎదుర్కోవడం ప్రతీ పౌరుడి బాధ్యత అని, విజిలెన్స్ అనేది ఒక సమిష్టి బాధ్యతగా ప్రతీ ఒక్కరూ భావించాలన్నారు. సింగరేణి సంస్థలో పారదర్శకత అవసరం సింగరేణి సంస్థలోని అన్ని...