ఆధార్ అప్‌డేట్‌లో విప్లవాత్మక మార్పు నవంబర్ 1 నుంచి ఇంటి వద్దే ఆధార్ సేవలు

డిల్లీ,డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28 ఇక ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన తిప్పలు లేవు. కోట్లాది ఆధార్ కార్డు హోల్డర్లకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) భారీ గుడ్‌న్యూస్ ఇచ్చింది. నవంబర్ 1 నుంచి ఆధార్ వివరాల అప్‌డేట్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇక ఆధార్ అప్‌డేట్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఇకపై పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్ వంటి జనాభా వివరాలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో నుంచే ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు. UIDAI రూపొందించిన కొత్త డిజిటల్ విధానం ద్వారా ఇది మరింత వేగంగా, సురక్షితంగా,...