తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం శేషాచల కొండలు పచ్చదనంతో మెరిసిపోతున్నాయి

తిరుపతి , డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28 ముంతా తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండడంతో దేవతా నగరం చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. వర్షాల వలన శేషాచల కొండలు పచ్చని ఆవరణతో సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. జలపాతాల హోరులో శేషాచలం ఎత్తైన కొండలపై నుండి పాలనురుగులా దూకుతున్న జలపాతాలు భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం జలపాతం కనువిందు చేస్తోంది. అలాగే మోకాళ్ళ మెట్టు సమీపంలోని అక్కగార్ల గుడి వద్ద ఎత్తైన బండరాళ్లపై నుండి జాలువారుతున్న జలధారలు అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తున్నాయి. పొంగి ప్రవహిస్తున్న సెలయేర్లు భారీ వర్షాల కారణంగా కొండల మధ్యుగా ప్రవహించే...