భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం
పుట్టపర్తి, ఎపి డైనమిక్ డెస్క్, అక్టోబర్ 28 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు మంగళవారం ఆహ్వానించారు. ట్రస్ట్ సభ్యుల భేటీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఇతర సభ్యులు కలిసి క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాల ఏర్పాట్ల వివరాలు ట్రస్ట్ సభ్యులు శతజయంతి ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను ఉప ముఖ్యమంత్రికి తెలియజేశారు. నవంబర్ 19న పుట్టపర్తిలో ప్రధాన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు...