సూర్యాపేట జిల్లా పోలీసు అధికారుల నెలవారీ సమీక్ష సమావేశం రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో,డైనమిక్, అక్టోబర్ 28 జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆధ్వర్యంలో పోలీసు అధికారుల నెలవారీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గత నెలలో నమోదైన నేరాల స్థితిగతులను పరిశీలించి, కేసు దస్త్రాలను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులకు వివిధ సూచనలు చేశారు. నేరాల నిరోధంలో సాంకేతికత కీలకం పోలీసు సిబ్బంది సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. పిర్యాదులపై వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి వేగంగా చేరుకోవాలని,రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.పెండింగ్ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి, నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోక్సో, మహిళా...