రాజుపాలెం బీసీ హాస్టల్‌ను మంత్రి సవిత పరిశీలన

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, అక్టోబర్ 28 పల్నాడు జిల్లా సత్తెనపల్లినియోజకవర్గంలోని రాజుపాలెం బాలురు బీసీ హాస్టల్‌ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమెతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. పెచ్చులూడిన హాస్టల్‌ భవనంపై ఆందోళన హాస్టల్ భవనం చాలా పాతదై పెచ్చులూడి ప్రమాదకరంగా మారిందని విద్యార్థులు వివరించగా, మంత్రి సవిత వెంటనే స్పందించారు.హాస్టల్‌లోని విద్యార్థులను తక్షణమే వేరే భవనానికి తరలించాలని, ఇందుకోసం అద్దెకు కొత్త భవనం తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. నూతన...