మైనర్ పిల్లలను అమ్మడం, కొనడం, దత్తత తీసుకోవడం తీవ్రమైన నేరం — జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 29 నల్లగొండ జిల్లాలో చట్ట విరుద్ధంగా ఇద్దరు శిశువులను అక్రమంగా దత్తతకు ఇచ్చిన ఘటనలో ఏడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెస్క్యూ చేసి ఇద్దరు బిడ్డలను సురక్షితంగా శిశు గృహానికి తరలించారు. మధ్యవర్తిత్వం చేసిన డాక్టర్ మరియు మరో వ్యక్తిపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుల వద్ద నుండి 20 వేల రూపాయలు, ఏడు మొబైల్ ఫోన్లు, దత్తత ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.బుదవారం ఈ ఘటనపై జిల్లా పోలీసు కార్యాలయంలో ఎర్పాటు చేసిన మిడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ,మహిళా శిశు సంక్షేమ అధికారి, జిల్లా బాల సంక్షేమ అధికారి,...