నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – మంత్రి పార్థసారథి బాపట్లలో ముంపు ప్రాంతాలు పరిశీలన

డైనమిక్ న్యూస్, బాపట్ల, అక్టోబర్ 29 మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి మరియు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం ఆయనతో పాటు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. పంటల నష్టం అంచనాకు ఆదేశాలు వరదలతో దెబ్బతిన్న వరి, మిరప పంటలపై సమగ్ర అంచనాలు వేయాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పార్థసారథి తెలిపారు. తుఫాన్‌ ప్రభావం వల్ల కొంత నష్టం జరిగినప్పటికీ ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు విద్యుత్‌...