తుఫాను నేపథ్యంలో కలెక్టర్ హెచ్చరికలు – ఎవరూ సెలవుపై వెళ్లరాదు!

నల్గొండ బ్యూరో,అక్టోబర్ 30 , డైనమిక్ మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో తుఫాను ప్రభావం, సహాయక చర్యలపై సమీక్ష జరిగింది. 24 గంటలు పని చేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుఫాను నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు సమయానుకూలంగా అందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు వర్షాలు, నష్టం లేదా అత్యవసర పరిస్థితులపై...