విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతంపెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ నిరసన
డైనమిక్ న్యూస్,దేవరకొండ, అక్టోబర్ 30 దేవరకొండ పట్టణంలో విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై 500 మందికి పైగా విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ – “పేద విద్యార్థుల జీవితాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 8,150 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి,” అన్నారు.ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న...