ప్రజాధనం దుర్వినియోగమా? మోడీ ప్రభుత్వం – అదానీ గ్రూపు సంబంధాలపై వాషింగ్టన్ పోస్ట్ సంచలన నివేదిక
న్యూ ఢిల్లీ , డైనమిక్ డెస్క్, అక్టోబర్ 31 భారత ఆర్థిక వ్యవస్థలో కార్పొరేట్–ప్రభుత్వ సంబంధాలు మరోసారి వివాదానికి దారితీశాయి. అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ తాజాగా విడుదల చేసిన దర్యాప్తు నివేదిక ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీ గ్రూపును ఆదుకోవడానికి ప్రజానిధులను వినియోగించినట్లు ఆరోపించింది. ఎల్‌ఐసి నిధులతో అదానీకి ఊరటనా? విదేశీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి వెనకడుగు వేసిన సమయంలో, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) నుంచి సుమారు 3.9 బిలియన్ డాలర్లు (రూ.33 వేల కోట్లు) అదానీ సంస్థల్లో పెట్టుబడులుగా మళ్లించారని ఆ పత్రిక పేర్కొంది. ఇది కేవలం ఆర్థిక సహాయం కాకుండా, ప్రభుత్వం ఒక ప్రైవేట్ కార్పొరేట్...