దేశ ఐక్యత కోసం "రన్ ఫర్ యూనిటీ" – కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో ఘనంగా నిర్వహణ
సూర్యాపేట బ్యూరో, అక్టోబర్ 31 (డైనమిక్ న్యూస్): ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ , జిల్లా ఎస్పీ నరసింహ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్ చౌరస్తా నుండి మినీ ట్యాంక్ బండ్ వరకు సుమారు వెయ్యి మందికి పైగా పౌరులు, విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ ఐక్యత, పౌరుల ఐకమత్యం, జాతీయ సమగ్రతను ప్రతిబింబించే నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. దేశ ఐక్యతకు సర్దార్...