నల్లగొండలో ఉత్సాహంగా “రన్ ఫర్ యూనిటీ సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం
నల్లగొండ బ్యూరో, డైనమిక్ నల్లగొండ పట్టణంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ 2కె రన్‌కు జెండా ఊపి ప్రారంభించారు.యన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు సాగిన ఈ రన్‌లో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానిక యువత, ప్రజలు కలిపి సుమారు 500 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ సమైక్యత, ఐక్యతను ప్రతిబింబించేలా నినాదాలు చేస్తూ రన్ కొనసాగించారు.కార్యక్రమం అనంతరం సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పమాల...