ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలి — కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట బ్యూరో, డైనమిక్, అక్టోబర్ 31 సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.శుక్రవారం ఆయన చివ్వేముల మండలం ఐలాపురం, సూర్య తండాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ “మొంథా తుఫాన్ కారణంగా ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు ఆగినందున ఎండలకు ఆరబెట్టి, 17 శాతం తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలి” అని సూచించారు. టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లపై పరిశీలన ఐలాపురం ఐకేపీ కేంద్రంలో ప్రభుత్వం పంపిన టార్పాలిన్లను కలెక్టర్ పరిశీలించారు.ఎన్ని టార్పాలిన్లు...