కారం పూడి మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహణ
డైనమిక్,కారంపూడి, నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మేల్యే జూలకంటి బ్రహ్మనంద రెడ్డీ ఆదేశాల మేరకు శనివారం కారంపూడి మండల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలవ్యాప్తంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కారంపూడి పట్టణంతో పాటు కాచవరం, ఇనుపరాజుపల్లి, గాదేవారిపల్లి, బట్టువారిపల్లి, చినకోదమగుండ్ల, పెదకోదమగుండ్ల గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి అర్హుడికి పింఛన్ అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేశారు. ప్రజల్లో ఆనందం – సీఎం చంద్రబాబు నాయకత్వానికి ప్రశంసలు పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ఎన్టీఆర్ భరోసా పథకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా...