నల్గొండ జిల్లా ఆర్జాలభావి ఐకెపి కేంద్రంలో తడిసిన ధాన్యం పరిశీలన చేసి రైతులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్1 నల్గొండ పట్టణ పరిధిలోని ఆర్జాలభావి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీ ఏ సి ఎస్) కొనుగోలు కేంద్రంలో తుఫాన్ ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, బాధిత రైతులను పరామర్శించారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ నేతలు, రైతులు ఆయనతో పాటు ఉన్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “పంటలు నష్టపోయి రైతులు పుట్టెడు దుఃఖంలో విలవిలలాడుతున్నారు. ఒక వైపు ప్రకృతి ప్రకోపం, మరో వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలను బలితీసుకుంటోంది” అని పేర్కొన్నారు.ప్రస్తుత...