జిల్లాలో కలెక్టర్ ఇలా త్రిపాఠి సుడిగాలి పర్యటన ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని ఆదేశాలు – వర్ష సూచనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాలి తడవకుండా ధాన్యం కాపాడాలని కలెక్టర్ ఆదేశాలు
డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 1 తిరిగి వర్ష సూచనల నేపథ్యంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని, సరైన తేమశాతం వచ్చిన వెంటనే మిల్లులకు తరలించాలని ఆమె సూచించారు. తిప్పర్తి మండలంలో ఆకస్మిక తనిఖీ శనివారం కలెక్టర్ త్రిపాఠి తిప్పర్తి మండలం చిన్న సూరారం గ్రామంలోని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ధాన్యం తేమశాతం, కొనుగోలు ప్రక్రియ, రైతుల సమస్యలను సమీక్షించారు.రైతులతో మాట్లాడిన కలెక్టర్ మాట్లాడుతూ “వర్షం మళ్లీ పడే అవకాశాలు ఉన్నందున ధాన్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు...