ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యం హుజూర్‌నగర్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే  పద్మావతి రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహణ ప్రజలతో నేరుగా మమేకమైన ప్రజానాయకురాలు పద్మావతి రెడ్డి

డైనమిక్ ,హుజూర్‌నగర్‌, నవంబర్‌ 1 ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని, తక్షణ పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శనివారం హుజూర్‌నగర్ క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్‌ ప్రారంభమైన క్షణం నుండి ప్రజల సందడి ఆ ప్రాంగణాన్ని నిండా ముంచెత్తింది. మండలాల వారీగా వందలాది మంది ప్రజలు తమ సమస్యలతో ఎమ్మెల్యేని కలిసారు. సమస్యల పరిష్కారానికి కృతనిశ్చయంతో ముందుకు ప్రజలతో ఒక్కొక్కరుగా మాట్లాడిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, విద్యుత్‌, పంచాయతీ, సాగునీరు, పెన్షన్లు, ఆరోగ్యం, హౌసింగ్ వంటి అనేక విభాగాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులను తక్షణమే పిలిపించి అవసరమైన దిశానిర్దేశాలు జారీ చేశారు. ప్రజలు...