ఎగిరే కారు తెస్తున్న ఎలాన్ మస్క్— టెక్ ప్రపంచంలో కొత్త సంచలనం అసాధ్యాలను సాధ్యం చేసే మస్క్
డైనమిక్ డెస్క్, డిల్లీ,నవంబర్2 ఎప్పటికప్పుడు వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మరో సంచలన ప్రకటన చేశారు. ఆయన తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, గాల్లో ఎగిరే కారును టెస్లా తయారు చేస్తోందని వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ప్రోటోటైప్ ప్రదర్శన మస్క్ ప్రకారం, ఈ ఏడాదిలోనే ఆ ఎగిరే కారుకు సంబంధించిన ప్రోటోటైప్‌ను ప్రపంచానికి చూపించనున్నారు. ఇది టెస్లా చరిత్రలో కీలక ఘట్టంగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. రెక్కలతోనా? లేక హెలికాప్టర్లా? ఆ కారు ఎలాంటి విధానంలో ఎగురుతుందన్న అంశంపై మాత్రం మస్క్ వివరాలు వెల్లడించలేదు. “ఆ కారు రెక్కల సాయంతోనా, లేక హెలికాప్టర్‌ల్లా ఎగురుతుందా?” అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా...