నేరేడుచర్లలో ఓపెన్ స్కూల్ చేరికలకు ఈ నెల 7 న చివరి అవకాశం – బట్టు మధు
నేరేడుచర్ల, డైనమిక్ ,నవంబర్ 2 తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS), హైదరాబాద్ ఆధ్వర్యంలో టెన్త్ మరియు ఇంటర్ కోర్సుల్లో చేరికలకు చివరి అవకాశం ఈనెల 7వ తేదీ వరకు మాత్రమే ఉందని ఆదివారం పీ ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ఓపెన్ స్కూల్ సెంటర్ కోఆర్డినేటర్, ప్రధానోపాధ్యాయులు బట్టు మధు తెలిపారు.ఇప్పటికే టెన్త్, ఇంటర్ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు తరగతులను ప్రారంభించి, ప్రభుత్వం పంపిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. చదువును మధ్యలో ఆపిన విద్యార్థులు, వయోజనులు ఈ ఓపెన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసి తదుపరి చదువులు కొనసాగించడం తోపాటు ఉద్యోగ...