సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నేరేడుచర్లలో బీజేపీ ఆగ్రహం దేశ గౌరవాన్ని అవమానపరిచిన రేవంత్ వెంటనే రాజీనామా చేయాలి – బీజేపీ డిమాండ్

డైనమిక్,నేరేడుచర్ల, నవంబర్ 2 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నేరేడుచర్ల భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. పట్టణ కేంద్రంలో బీజేపీ నేతలు శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించి రేవంత్ రెడ్డిని తీవ్రంగా తప్పుపట్టారు.పట్టణ బీజేపీ అధ్యక్షుడు కొనతం నాగిరెడ్డి, మండల అధ్యక్షుడు చింతకుంట్ల రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. నాయకులు మాట్లాడుతూ — “రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేశాన్ని, భారత సైన్యాన్ని అవమానపరిచేలా ‘పాకిస్తాన్ తన్నింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యలు చేసే...