రోడ్డున పడ్డ రైతు.. పెట్టుబడి రెక్కల కష్టమంతా వరద పాలు!అకాల వర్షానికి తడిసిన వడ్లు, మొక్కజొన్న — చేతికొచ్చిన పంట నీటిపాలు
మెదక్ జిల్లా,డైనమిక్, నవబంబర్ 3 అకాల వర్షం మెదక్ జిల్లా రైతులకు పెద్ద దెబ్బ తగిలించింది. ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. కళ్లాలలో, రోడ్లపై ఆరబెట్టిన వడ్లు, మొక్కజొన్న తడిసి రైతుల కష్టానికి నీరాజనం పట్టాయి. ఆరబెట్టిన పంటలకు తీవ్ర నష్టం మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం, మొక్కజొన్న రాశులను రైతులు రోడ్లపైనే ఆరబెట్టారు. ఆకస్మికంగా వర్షం కురవడంతో వాటిని కప్పుకునే వీలు లేకుండా పోయింది. వడ్ల కుప్పలు నీటిలో తడిసి ముద్దయ్యాయి. తేమ పెరగడంతో మొలకెత్తే ప్రమాదం నెలకొంది. కొన్నిచోట్ల వడ్ల రాశులు నీటితో కొట్టుకుపోయాయి. మొక్కజొన్న గింజలు...