రాష్ట్రవ్యాప్తంగా "ప్రెస్ క్లబ్" భవనాలు నిర్మించాలి నవంబర్ రెండవ వారంలో నిరాహార దీక్షలు – సూర్యాపేట నుండి ప్రారంభంతెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
సూర్యాపేట బ్యూరో, డైనమిక్,నవంబర్3 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల కోసం “ప్రెస్ క్లబ్” భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ రెండవ వారంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సోమవారం ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. “జర్నలిస్టులకు నిలువ నీడ లేదు” జర్నలిస్టులు అహర్నిశలు ప్రజలకు, ప్రభుత్వానికి సమాచారంఅందజేస్తున్నప్పటికీ వారికి రాష్ట్రంలో నిలువనీడ లేకుండా పోయిందని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం గురించి ఆలోచించే నాయకత్వం, పరిపాలన రెండూ కరువయ్యాయని ఆయన తెలిపారు. “ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయి” ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టుల భవనాల కోసం డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు, అధికారులు నిమ్మకు...