నూతన ఉపాధ్యాయుల గుండెల నిండా ధైర్యం నింపిన చాట్రాయి సదస్సు
ఏలూరు జిల్లా, చట్రాయి, డైనమిక్ డెస్క్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన చాట్రాయి మండలం, ఇప్పుడు ఉపాధ్యాయ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా మారింది. డెమోక్రటిక్ పి.ఆర్.టి.యూ చాట్రాయి మండల శాఖ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నుండి రాత్రి పొద్దుపోయేంతవరకు నూతన ఉపాధ్యాయులకు స్వాగతాభినందన సదస్సు ఘనంగా నిర్వహించారు.ఈ సదస్సులో 52 మంది నూతన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామారావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్. నాగేశ్వరరావు, జిల్లా నాయకులు ఎం. తిరుపతయ్య తదితరులు సమన్వయం చేశారు. ముఖ్య అతిథులుగా విస్సన్నపేట నుండి విచ్చేసిన సీనియర్ నాయకులు పెండెం రామకృష్ణ, ఆర్. శోభన్ బాబు,...