అథ్లెటిక్స్‌లో ఏపీ టిడబ్ల్యూ.ఆర్. స్కూల్ విద్యార్థుల మెరుపు ప్రదర్శన
డైనమిక్,కారంపూడి, నవంబర్ 5 కారంపూడి మండలంలోని ఏపీ టిడబ్ల్యూ.ఆర్. స్కూల్ విద్యార్థినులు అథ్లెటిక్స్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబర్చారు. ఎస్‌జీ ఎఫ్‌ఐ గేమ్స్‌లో అండర్–17 విభాగంలో పలు విభాగాల్లో విజేతలుగా నిలిచి, జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించారు. అండర్–17 విభాగంలో సత్తా చాటిన విద్యార్థినులు నవంబర్ 4న జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల విభాగంలో ఏపీ టిడబ్ల్యూ.ఆర్. స్కూల్ విద్యార్థినులు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.1500 మీటర్ల రేసులో బి. పూజ (9వ తరగతి) రెండవ స్థానం సాధించగా,400 మీటర్ల విభాగంలో బి. దివ్య విశేష ప్రతిభ కనబర్చింది.లాంగ్ జంప్ విభాగంలో బి. స్వాతి మూడవ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైంది....