గీత పనివారుల బకాయిలను తక్షణమే చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం 132 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ సూర్యాపేట జిల్లా గీతపనివారుల సంఘం ధర్నా
డైనమిక్, నేరేడుచర్ల, నవంబర్ 6 గీత వృత్తిలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన గీత పరివారాల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉన్న రూ.132 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని గీతపనివారల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ కోటయ్య డిమాండ్ చేశారు.గురువారం నాడు నేరేడుచర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు గీత పనివారల సంఘం నేరేడుచర్ల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, మాట్లాడుతూ "రాష్ట్ర ప్రభుత్వానికి 132 కోట్లు పెద్ద మొత్తం కాదని, కానీ గీత పనివారల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడం సరికాదని" అన్నారు. ఎక్స్‌గ్రేషియా పెంపుతో పాటు సురక్షా కిట్లు అందించాలి గీత వృత్తిలో...