వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు ఘనంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గీతాలాపన
మెదక్ జిల్లా స్టాఫర్, నవంబర్ 7, డైనమిక్ స్వాతంత్ర్య ఉద్యమకారుల్లో పోరాట స్ఫూర్తిని రగిలించిన జాతీయ గేయం “వందేమాతరం” 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఘనంగా సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించబడింది. దేశభక్తి స్ఫూర్తితో గీతాలాపన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ టౌన్, రూరల్, హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది “వందేమాతరం” గీతాన్ని సమూహంగా ఆలపించి దేశభక్తి సందేశాన్ని వ్యాప్తి చేశారు. ‘వందేమాతరం’లో ఐక్యత, త్యాగ స్ఫూర్తి ఉంది — ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ...