వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తినల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో దేశభక్తి గేయాలాపన

డైనమిక్,నల్లగొండ బ్యూరో, నవంబర్ 7 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయానికి నేడు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశభక్తి ఉత్సాహం నిండిన వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆధ్వర్యంలో గేయాలాపన జిల్లా పోలీస్ అధికారి శరత్ చంద్ర పవార్, ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సమిష్టిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంలో ఎస్పీ మాట్లాడుతూ — “దేశభక్తిని, ఐక్యతను ప్రతిబింబించే ఈ గేయం ప్రతి భారతీయుడిలో ఆత్మగౌరవాన్ని నింపుతుంది. మనమంతా దేశ సేవలో భాగమవ్వాలన్న స్పూర్తి ఇందులో ఉంది” అని పేర్కొన్నారు. దేశభక్తి జ్యోతి నిలుపుదాం:ఎస్పీ...