జిల్లా కేంద్రంలో భవ్యంగా వందేమాతర ఉత్సవం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహా

సామూహికంగా వందేమాతర గీతాలాపన డైనమిక్,సూర్యాపేటబ్యూరో, నవంబర్ 7 వందేమాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు భవ్యంగా వందేమాతర ఉత్సవం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పౌరులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐక్యతకు ప్రతీక వందేమాతరం – ఎస్పీ నరసింహా 60 ఫీట్లు రోడ్డునుంచి వాణిజ్య భవన్ సెంటర్‌వరకు వందేమాతర నినాదాలు, “భారత్ మాతాకీ జై” నినాదాలతో భారీ ర్యాలీ సాగింది. అనంతరం వాణిజ్య భవన్ సెంటర్ వద్ద జాతీయ పతాకావిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ నరసింహా మాట్లాడుతూ “వందేమాతర గీతం భారత స్వాతంత్రోద్యమానికి ప్రేరణగా నిలిచింది....