ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి :జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు ఆదేశాలు

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 10,డైనమిక్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి దరఖాస్తును అధిక ప్రాధాన్యతతో పరిశీలించి, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల అర్జీలను స్వీకరించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి అధికారులు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తేమ శాతం 17 వచ్చిన వెంటనే కాంటా వేసి లారీల ద్వారా మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోలు వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలని కూడా ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులకు రిజిస్టర్ ఏర్పాటు చేయాలి ప్రతి శాఖలో ప్రజావాణి...