ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన నేడుపెదఈర్లపాడు, గంగపాలెం పరిశ్రమలకు నూతన ఊపిరి

ఎపి, డైనమిక్ డెస్క్,నవంబర్11 ప్రకాశం జిల్లా పెదఈర్లపాడు లో సీఎం చంద్రబాబు నేడు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) పార్క్‌ను ప్రారంభించనున్నారు. ఈ పార్క్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించనున్నది. గంగపాలెం ఇండస్ట్రియల్ పార్క్‌కు వర్చువల్ ప్రారంభం అలాగే గంగపాలెం ప్రాంతంలో నిర్మాణం పూర్తయిన ఇండస్ట్రియల్ పార్క్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ పార్క్ ద్వారా జిల్లాలో పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యత రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు....