నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్… ప్రజలు జాగ్రత్తగా ఉండాలి : ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 11 , డైనమిక్ న్యూస్ సైబర్ మోసగాళ్లు ఇప్పుడు పోలీసు అధికారుల పేర్లను కూడా దుర్వినియోగం చేస్తున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. తన పేరుతో “ఎస్‌పీ సూర్యాపేట (SP Suryapet)” పేరున ఒక నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ సృష్టించి, ప్రజలకు సందేశాలు పంపుతున్నారని ఆయన చెప్పారు. మోసం చేసేందుకు కొత్త పద్ధతులు ఆ అకౌంట్ ద్వారా కొంతమందికి వ్యాపారం పేరుతో పెట్టుబడులు పెట్టమని, కొందరికి డబ్బు అడిగే ప్రయత్నాలు చేస్తున్నారని ఎస్పీ వివరించారు. ఇది పూర్తిగా మోసపూరిత చర్య అని, ఎవరూ అలాంటి సందేశాలకు స్పందించవద్దని హెచ్చరించారు. ప్రజల సహకారం కోరిన ఎస్పీ...