ప్రతి నెల 100కు పైగా మొబైల్ ఫోన్లు రికవరీ చేస్తున్న జిల్లా పోలీసులు ఈ నెలలో రూ.20 లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత సి.ఈ.ఐ.ఆర్ ద్వారా ఇప్పటివరకు 2,340 మొబైల్ ఫోన్ల రికవరీ రైతులు, ప్రజలు సైబర్ మోసాలకు గురికాక అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ
సూర్యాపేట బ్యూరో, నవంబర్ 11 , డైనమిక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ కె.నరసింహ ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 102 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేసి, సంబంధిత బాధితులకు స్వయంగా అందజేశారు. “సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు” – ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఏడవసారి మొబైల్ రికవరీ మేళా నిర్వహించామని, ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 2,340 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి యజమానులకు అందించామని తెలిపారు.మంగళవారం రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్‌ను బాధితులకు అందించామని చెప్పారు.ఈ ఫోన్లను వివిధ రాష్ట్రాల నుంచి...