వయోవృద్ధుల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభం
నల్లగొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 12 ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం (అక్టోబర్ 1)ను పురస్కరించుకొని, వికలాంగులు వయోవృద్ధులు ట్రాన్స్‌జెండర్స్ సాధికారత శాఖ, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు వయోవృద్ధుల పట్ల ప్రేమ, ఆప్యాయతతో మెలగాలి – కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ,“వయోవృద్ధులు ఆరోగ్యంగా, ఆయురారోగ్యంతో ఉన్నప్పుడు కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయి. వారిని ప్రేమ, ఆప్యాయతతో గౌరవించాలి” అని పేర్కొన్నారు. ఈ రోజు నుండి నవంబర్ 12 నుండి 19 వరకు వయోవృద్ధుల వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలతో...