ప్రసవాల నిర్వహణలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 12 నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలో ప్రసవాల నిర్వహణలో అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 30 లక్షల వ్యయంతో వికలాంగుల ధ్రువపత్రాల కేంద్రం ప్రారంభం బుధవారం మంత్రి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల తర్వాత ఎక్కువగా ప్రసవాలు జరిగేది నల్గొండ జిజిహెచ్‌లోనే. నెలకు సగటున 700 నుండి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి” అని తెలిపారు....