స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు మళ్లీ ఊపందుకుంది పీఆర్‌ శాఖకు నోట్‌ తయారు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు 17న కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

హైదరాబాద్‌, డైనమిక్ డెస్క్, నవంబర్ 13 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కసరత్తు మళ్లీ వేగం అందుకుంది. ఈ నెల 24న హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు ఆదేశాల ప్రకారం 24వ తేదీ లోపు ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించినందున, సర్కార్‌ అప్రమత్తమైంది. కేబినెట్‌ భేటీలో చర్చకు అవకాశాలు ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 17న మంత్రిమండలి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం ప్రధాన చర్చా విషయంగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై పంచాయతీరాజ్‌...