భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాలను పరిశీలించిన ఎస్పీ నరసింహ వేదింపులకు గురైన బాలలు, మహిళలకు నైతిక ధైర్యం – రక్షణ కల్పించడమే లక్ష్యం

సూర్యాపేట బ్యూరో, డైనమిక్,నవంబర్13 సూర్యాపేట జిల్లా పోలీసు అధికారి కె.నరసింహ గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ మహిళా భరోసా సెంటర్‌, షీ టీమ్స్ కార్యాలయాలను సందర్శించి రికార్డులు, కార్యకలాపాలను పరిశీలించారు. “వేదింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలి” – ఎస్పీ పిలుపు వేదింపులు, దాడులకు గురైన మహిళలు, పిల్లలు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ పిలుపునిచ్చారు. "వేదింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేస్తేనే వాటిని అరికట్టవచ్చు" అని ఆయన అన్నారు. భరోసా సెంటర్‌ ద్వారా సమగ్ర సేవలు మహిళలు, బాలలకు న్యాయపరమైన, వైద్యపరమైన, సామాజిక భద్రత, మానసిక ధైర్యం, విద్య వంటి అన్ని సదుపాయాలు ఒకే చోట అందించే విధంగా రాష్ట్ర పోలీస్...