"నీ వాహనం వేగంగా వెళ్తుంది… కానీ నీ జీవితం ఆగిపోతుంది"రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్న కార్యక్రమం ప్రారంభించిన నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరి బాధ్యత – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ బ్యూరో, డైనమిక్,నవంబర్13 నల్లగొండ జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నమైన పద్ధతిలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.నేషనల్ హైవే–65లోని చిట్యాల మండలం వెలిమినేడు వద్ద “నీ వాహనం వేగంగా వెళ్తుంది. కానీ నీ జీవితం ఆగిపోతుంది” అనే నినాదంతో ప్రత్యేక హోల్డింగ్ ఏర్పాటు చేశారు.యాక్సిడెంట్‌కి గురైన కారును ప్రదర్శనగా ఉంచి వాహనదారులకు రోడ్డు భద్రతపై సందేశం అందించారు. "ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి" – జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ “ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత నియమాలపై అవగాహన అవసరం.అతివేగంగా వాహనం నడపడం, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనం...