ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన 15 లక్షల రూపాయల నిధులతో పనులు ప్రారంభం

కారం పూడి, డైనమిక్,నవంబర్13 మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గురువారం కారంపూడి పట్టణంలోని ఎస్సీ కాలనీలో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడే భవనం ఈ కమ్యూనిటీ హాల్ స్థానిక ప్రజలకు వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే వేదికగా ఉపయోగ పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వసతులు, ప్రజా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. “ప్రజల సౌకర్యమే మా లక్ష్యం” – జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజల అభ్యర్థన మేరకు ఈ హాల్ నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులు కేటాయించామని, అత్యుత్తమ...