ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్!సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇన్‌సర్వీస్ టీచర్లలో ఆందోళన • ఉద్యోగ భవిష్యత్తుపై అనిశ్చితి
హైదరాబాద్, డైనమిక్ డెస్క్, నవంబర్ 15 సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. పీఈటీలు, పీడీలు మినహా మిగతా అన్ని కేడర్ల ఉపాధ్యాయులు వచ్చే రెండు సంవత్సరాల్లో ‘టెట్’ (Teacher Eligibility Test) తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని కోర్టు స్పష్టం చేయడంతో టీచర్లలో టెన్షన్ పెరిగింది. ఉద్యోగ భద్రత, పదోన్నతులు, భవిష్యత్తు అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భావన బలపడుతోంది. ఇన్‌సర్వీస్ టీచర్లపై కొత్త ఒత్తిడి రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు ఇప్పటివరకు టెట్ అర్హత అవసరం లేదు. అయితే కోర్టు తీర్పుతో పరిస్థితి మారిపోయింది.పాఠశాల బోధన బాధ్యతలతో పాటు...